26-04-2025 12:00:00 AM
మృతుల పట్ల శాంతికై ప్రత్యేక పూజలు
భద్రాచలం, ఏప్రిల్ 25 (విజయక్రాంతి)జమ్మూ కశ్మీర్లోని పెహల్గాం ప్రాంతంలో జరిగిన దుర్ఘటనలో అమాయక ప్రజలు ప్రా ణాలు కోల్పోయిన ఘటనపై భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉద్యోగులు, అర్చకులు ,వైదిక సిబ్బంది తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటన నేపథ్యం లో శుక్రవారం దేవస్థాన పరిపాలన బృం దం, ప్రధాన అర్చకులు, వైదిక సిబ్బంది మృతులకు సంతాపం ప్రకటించారు.
మానవీయ కోణాన్ని కళ్లకు కట్టేలా స్వామివారి స న్నిధిలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని, బాధిత కుటుంబాలకు ఆ పరమాత్మ ఆదరణ కలగాలని ప్రార్థనలు నిర్వహించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.భద్రాచల దేవస్థానం తర ఫున జాతీయ విషాద ఘటనపై స్పందించ డం శ్లాఘనీయం అని భక్తులు అభిప్రాయపడుతున్నారు.