calender_icon.png 12 January, 2025 | 1:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మన్మోహన్ మృతికి సంతాపం

30-12-2024 03:10:16 AM

కొవ్వొత్తులతో కాంగ్రెస్ నాయకుల ర్యాలీ

రామగిరి, డిసెంబర్ 29 : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సూచకంగా రామగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఆదివా రం రాత్రి కోవ్వత్తుల ర్యాలీ నిర్వహిం చారు. సెంటినరీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రొడ్డ బాపాన్న, టౌన్ అధ్యక్షులు కాటం సత్యం  ఆధ్వర్యంలో   కొవ్వొత్తు లతో సంతాపం తెలిపారు. 

ఆయన మరణంతో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని, ఒక ఆర్థిక వేత్తగా,ఒక అధ్యాపడిగా, రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా, రాజ్యసభ సభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా, ప్రధానమంత్రిగా దేశానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో  రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ, ఐఎన్‌టియుసి నాయకులు, మహిళ కాంగ్రెస్ నాయకురాళ్లు పాల్గొన్నారు.