calender_icon.png 27 December, 2024 | 9:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కురుల అందానికి కండిషనర్!

22-07-2024 12:05:00 AM

కురులకు పోషణ అందాలి. జుట్టు మెత్తగా, సిల్క్ గా ఉండాలని కండిషనర్ రాస్తుంటాం. తీరా అదే కొన్నిసార్లు పొడిబారేలా చేస్తుంది. మరికొన్ని కండిషనర్లు జుట్టు బరకగా మారేలా చేస్తాయి. సమస్య ఏదైనా సహజ సిద్ధమైన కండిషనర్లు వాడటం మంచిదని చెబుతున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం..

* సగం కప్పు తేనెకు చెంచా ఆలివ్ నూనె చేర్చి, బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలస్నానం పూర్తయ్యాక తడితలకు పట్టించి, పది నిమిషాలు వదిలేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఈ మిశ్రమం కురులను నిగనిగలాడేలా చేస్తుంది. 

* రెండు గుడ్ల తెల్లసొనకు చెంచా తేనె, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి, తలకు పట్టించాలి. అరగంటయ్యాక గోరు వెచ్చని నీటితో కడిగేస్తే సరిపోతుంది. ఇలా చేస్తే జుట్టు ఆరోగ్యంగా మెరుస్తుంది.

* నాలుగు చెంచాల బేకింగ్ సోడా తీసుకోవాలి. తలస్నానం చేశాక మాడు నుంచి కురుల వరకు దీన్ని పట్టించి, అయిదు నిమిషాలు మర్దనా చేయాలి. అరగంటయ్యాక గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేస్తే చాలు. ఇది చుండ్రు సహా ఎన్నో సమస్యలను దూరం చేస్తుంది. జుట్టు ఆరోగ్యంగా, బలంగా పెరిగేలా చేస్తుంది.