13-02-2025 01:12:48 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): ఆమనగల్‌లో బీఆర్‌ఎస్ సభ నిర్వహణకు హైకోర్టు బుధవారం షరతులతో అనుమతి మంజూరు చేసింది. ఈనెల 18న స్థానిక జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 3 వేల మందితో సభ నిర్వహణకు ఓకే చెప్పిం ది.
నేర చరిత్ర ఉన్నవారిని సమావేశానికి అనుమతించరాదని, ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే బాధ్యుల వివరాలను ముందుగానే అందజేయాలంది. శాంతిభద్రతల సమస్య తలెత్తకుం డా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సమావేశంలో రెచ్చ గొట్టే ప్రసంగాలు, మత, రాజకీయ పరమైన ప్రకనటనలు చేయరాదని సూచిం చింది.
షరతులను ఉల్లంఘించినా, ఏవైనా అవాంఛనీయ సంఘటలు జరిగి ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తే పోలీసులు చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించేందుకు చేపట్టిన నిరసన కార్యక్రమానికి అనుమతి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ బీఆర్‌ఎస్ ఆమన గల్ పట్టణాధ్యక్షుడు ఎన్ పాత్యనాయక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ బీ విజయసేనారెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎం రూపేందర్ వాదనలు వినిపిస్తూ ప్రభుత్వ వైఫల్యంపై 5 వేల మందితో నిరసన సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ జూనియర్ కాలేజీ మైదానం, అయ్యప్పకొండ మైదానంలో సమావేశం నిర్వహించుకోవ డానికి అభ్యంత రం లేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి షరతులతో సభ నిర్వహణకు అనుమతి మంజూరు చేస్తూ విచారణను మూగించారు.