09-04-2025 12:00:00 AM
ఆందోళనకరంగా 15 మంది పరిస్థితి
నస్రుల్లాబాద్ మండలంలోని 4 గ్రామాల్లో బాధితులు
ఘటనపై విచారణ చేపట్టాలని కామారెడ్డి కలెక్టర్ ఆదేశం
కామారెడ్డి, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో కల్తీకల్లు ఏరులై పారుతున్నది. కల్తీకల్లు తయారీదారులకు ఎక్సైజ్ అధికారులు, ఖద్దర్ చొక్కాల లీడర్ల అండ ఉండటంతో కల్తీకల్లును యథేచ్ఛగా తయారుచేసి పేదల ప్రాణాలతో చెలగాటమాడు తున్నారు. మంగళవారం బాన్సువాడ ని యోజకవర్గంలోని నస్రుల్లాబాద్ మండలం దురిక్కీ అంకుల్ తండా, అంకుల్, హాజీపూ ర్, సంగ్యం గ్రామస్థులు కల్తీకల్లు సేవించి అస్వస్థతకు గురయ్యారు. మతిస్థిమితం కోల్పోయి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. 68 మందిని చికిత్స నిమిత్తం బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. 15 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో నిజామాబా ద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అం దిస్తున్నారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ ఆదేశా లు జారీ చేశారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి తెలిపారు. సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నరసింహారావు బాధితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కల్తీకల్లు అమ్మినవారిపై కేసు నమోదు చేసి వారి లైసెన్స్ రద్దు చేయనున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ నరసింహారావు తెలిపారు.
కల్తీక ల్లు విక్రయించిన దుకాణాలను సీజ్ చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. కాగా బాధితులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరే షన్ చైర్మన్ కాసుల బాలరాజు పరామర్శించారు. ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం, మామూ ళ్ల మత్తు వల్లనే కల్తీకల్లు విచ్చలవిడిగా అమ్ముతున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపి స్తున్నారు. కల్తీకల్లును నిరోధించడానికి టా స్క్‌ఫోర్స్ అధికారులచే తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.