calender_icon.png 5 December, 2024 | 7:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధ్వానంగా గురుకుల పాఠశాలల పరిస్థితి

04-12-2024 10:23:32 PM

బిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరీష్

కామారెడ్డి (విజయక్రాంతి): విద్యార్థుల పరిస్థితి అద్వాన్నంగా తయారైందని బిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరీష్ అన్నారు. రాష్ట్ర బిఆర్‌విఎస్ పిలుపుమేరకు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని మైనార్టీ సంక్షేమ సంఘీక గురుకులాలను బిఆర్‌ఎస్ నాయకులతో కలిసి బుధవారం సందర్శించారు. వసతి గృహాల్లో ఉన్న విద్యార్థుల సమస్యలపై విద్యార్థులను బోజన, యూనిఫాం, కాస్మోటిక్ వసతులు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గురుకులాల్లో ఉన్న వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. అంతే కాకుండా విద్యార్థులకు మెను ప్రకారం భోజనం అందించడం లేదని పలువురు విద్యార్థులు వారి తృష్టికి తెచ్చారని తెలిపారు. గత ప్రభుత్వంలో గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించారన్నారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలను రాను రాను నిర్వీర్యం చేయడం కోసం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఇప్పటి వరకు దాదాపుగా 40మంది విద్యార్థులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే గురుకులాలపై శ్రద్ద చూపి విద్యార్థుల ప్రాణాలు పోకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్‌వి నాయకులు భాను, దీపక్, పర్షురాం, ఎల్లారెడ్డి పట్టణ అధ్యక్షుడు అది మూలం సతీష్‌కుమార్, ఎల్లారెడ్డి సొసైటీ అధ్యక్షుడు యేగుల నర్సింలు, నాగం సురేందర్, ఇమ్రాన్, అరవింద్‌గౌడ్, మనోజ్, దయాకర్, భార్కత్, సత్యం తదితరులు పాల్గొన్నారు.