calender_icon.png 5 March, 2025 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కండెన్స్ షైన్ స్కూల్ ప్రిన్సిపాల్ నిర్వాకం

05-03-2025 12:31:27 AM

  1. విద్యార్థి బొట్టు పెట్టుకుని స్కూలుకు వచ్చినందుకు వాష్ రూమ్‌లోకి తీసుకెళ్లి బొట్టు తుడిపేయించిన ప్రిన్సిపాల్ లక్ష్మయ్య 
  2. కుటుంబ సభ్యులు, హిందు వాహిని ఆర్గనైజర్ సభ్యుల ఆందోళన 
  3. దిగివచ్చిన యాజమాన్యం.. ప్రిన్సిపాల్ సస్పెండ్ 

అబ్దుల్లాపూర్‌మెట్, మార్చి 4: స్కూల్ విద్యార్థులు బొట్టు పెట్టుకుని స్కూల్‌కు హాజరైనందుకు స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మయ్య విద్యార్థులను వాష్ రూమ్ లోకి తీసుకెళ్లి బొట్టు తుడిపించారని విద్యార్థులు తమ కుటుంబ సభ్యులకు చెప్పడంతో పేరెంట్స్ స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. విద్యార్థి మాట్లాడుతూ... గత శుక్రవారం ఉదయం స్కూల్ వచ్చాను.

అసెంబ్లీ లైన్ నిల్చోని ఉండగా... ఆదే సమయంలో మా స్కూల్ టీచర్స్ వచ్చి యూనిఫాం చెక్ చేసి.. నా తలకు బొట్టు ఉండడం చూసి వాష్ రూమ్‌కు వెళ్లి బొట్టు తుడిపేసుకుని క్లాస్ రూమ్‌లో వెళ్లామరని  ఆవేదనతో చెప్పడు. ఇదే విషయాన్ని హిందూ వాహిని ఆర్గనైజర్ వారికి తెలియడంతో స్కూలు వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.

ఇలా గతంలో కూడా ఇలాంటి ఈ స్కూల్‌లో ఘటనలు జరిగినట్లు విద్యార్థుల కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అదే విధంగా గతంలో ఫీజులు కట్టలేదని కక్ష్యాతో విద్యార్థులను షెల్లర్ కూల్చిపెట్టిన సంఘటలు ఉన్నట్లు విద్యార్థులు తల్లిదండ్రులు తెలిపారు. దీంతో యజమాన్యాన్ని వివరణ కోరగా.. స్కూల్ యాజమాన్యం ప్రిన్సిపల్ లక్ష్మయ్య ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు హిందూ వాహిని ఆర్గనైజేషన్ సభ్యులు ఆందోళన విరమించారు.

ఎంఈవో వివరణ కోరగా...

స్కూల్‌లో ఉదయం అసెంబ్లీ చేసే సమయంలో విద్యార్థులను లైన్‌లో నిల్చున్నప్పుడు 8వ తరగతి చదివే స్టూడెంట్ బొట్టుపెట్టుకొని రావడంతో ఫైర్ చేసే సందర్భంలో బొట్టు చెమట రూపంలో ముఖం మీద వస్తే.. ముఖం శుభ్రం చేసుకోని క్లాస్ రూమ్ వెళ్లామన్నామని చెప్పమని తెలిపారని ఎంఈవో జగదీశ్వర్ తెలిపారు.