04-03-2025 12:28:54 PM
విద్యార్థి బొట్టు పెట్టుకుని స్కూలుకు వచ్చినందుకు వాష్ రూమ్ లోకి తీసుకెళ్లి బొట్టు తుడిపేయించిన ప్రిన్సిపల్
కుటుంబ సభ్యులు, హిందు వాహిని ఆర్గనైజర్ సభ్యుల ఆందోళన
దిగివచ్చిన యాజమాన్యం ప్రిన్సిపాల్ ను సస్పెండ్
అబ్దుల్లాపూర్ మెట్: స్కూల్ విద్యార్థులు బొట్టు పెట్టుకుని స్కూల్ కు హాజరైనందుకు స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మయ్య(School Principal Lakshmaiah) విద్యార్థులను వాష్ రూమ్ లోకి తీసుకెళ్లి బొట్టు తుడిపించారని విద్యార్థులు తమ పేరెంట్స్ కు చెప్పడంతో పేరెంట్స్ స్కూల్ ముందు ఆందోళనకు దిగారు.ఇదే విషయాన్ని హిందూ వాహిని ఆర్గనైజర్ వారికి తెలియడంతో స్కూలు వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీంతో మల్లారెడ్డి ప్రిన్సిపల్ లక్ష్మయ్య ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.దీంతో కుటుంబ సభ్యులు హిందూ వాహిని ఆర్గనైజేషన్ సభ్యులు ఆందోళన విరమించారు.