13-02-2025 12:00:00 AM
కూసుమంచి, ఫిబ్రవరి 12 : హైదరాబా దులోని చిలుకూరి బాలాజీ ఆలయ అర్చ కుడిపై దాడి హేయమైన చర్య అని నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ సీనియర్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ అన్నారు. కూసుమంచి మండల కేంద్రం లో బుదవారం విలేకరుల సమావేశంలో ఆయన దాడిని తీవ్రంగా ఖండించారు. దాడిచేసిన దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
సమాజంలో మతం పేరిట జరిగే ఘర్షణ లు మానవ మనుగడకు చాలా ప్రమాదమ ని, మానవత్వానికి మించిన మతం లేదన్నా రు. ఆలయ అర్చకుడిపై అకారణంగా దాడి చేసిన వారిని పట్టుకుని శిక్షించాలని డి మాండ్ చేశారు. ఈ మధ్యకాలంలో చర్చి ల్లోకి, మసీదుల్లోకి, ఆలయాల్లోకి వెళ్లి దాడులు చేసే కల్చర్ పెరిగిపోయిందన్నా రు. రంగరాజన్‌పై దాడి చేయడం దారుణ మని మండిపడ్డారు.