calender_icon.png 24 April, 2025 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రదాడి పట్ల ఖండన

23-04-2025 08:35:40 PM

జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): జమ్మూ కాశ్మీర్ లో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తున్నట్లు జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ పేర్కొన్నారు. విశ్రాంతి కోసం కాశ్మీర్‌కి వెళ్లిన నిర్దోష పర్యాటకులపై ఈ దాడి మానవతా విలువలపై జరిగిన దాడిగా భావిస్తున్నామని, ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి జేబీపీ తరపున ఘన నివాళులు అర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

దేశ భద్రతపై ఉగ్రవాదులు గుప్పిస్తున్న దాడులను తీవ్రంగా ఎదుర్కొనాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే గట్టి చర్యలు తీసుకోవాలి. ఉగ్రవాదాన్ని పెంపొందించే శక్తులపై నిష్ఠూరంగా ఎదురుదాడి చేయాలని డిమాండ్ చేశారు. జేబీపీ, మానవ హక్కులు,సామాజిక సమానత్వం, శాంతి పరిరక్షణ కోసం కట్టుబడి ఉన్న పార్టీ అని ప్రజల ప్రాణాలు కాపాడే బాధ్యతను ప్రభుత్వ యంత్రాంగం మరింత ధీర్ఘంగా నిర్వర్తించాలని బుధవారం విడుదల చేసిన చేసిన ప్రకటనలో కోరారు.