calender_icon.png 9 October, 2024 | 4:47 AM

తాసిల్దార్‌పై దాడి ఘటనపై ఖండన

09-10-2024 12:39:22 AM

హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): వరంగల్ తాసిల్దార్ ఇక్బాల్ పై దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ తాసిల్దార్ అసోసియేషన్ (టీజీటీఏ) ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. తాసిల్దార్‌పై దాడిని  ఖండిస్తున్నామని టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు  రాములు, ప్రధాన కార్యదర్శి రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుని, దాడికి యత్నించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.