25-04-2025 02:25:30 AM
మునుగోడు,ఏప్రిల్ 24 (విజయ క్రాంతి):కాశ్మీర్ లో పర్యాటకుల మీద జరిగిన ఉగ్రవాదుల దాడులను ఖండించాలని, అమాయక ప్రజల మీద ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, డివైఎఫ్‌ఐ జిల్లా సహాయక కార్యదర్శి కట్ట లింగస్వామి అన్నారు.
కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడులకు నిరసనగా గురువారం మండల కేంద్రంలో డివైఎఫ్‌ఐ, సిపిఎం, సిఐటియు మండల కమిటీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఉగ్రవాదానికి, మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజలు, యువకులు మేధావులు తమ స్థాయిలో స్పందించి పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్,వరికుప్పల ముత్యాలు,జేరిపోతుల ధనుంజయ,వడ్లమూడి హనుమయ్య, యాసరాని శ్రీను, మిరియాల భరత్,కొంక రాజయ్య, దేవగోని రాజు, కాంతయ్య,డివైఎఫ్‌ఐ మండల అధ్యక్షుడు బొడ్డుపల్లి నరేష్, టౌన్ కార్యదర్శి యాట శ్రీకాంత్, నాయకులు నారగోని నరసింహ ఉన్నారు.