calender_icon.png 25 March, 2025 | 5:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కీం వర్కర్లు, సీఐటీయూ నాయకుల అక్రమ అరెస్టులు ఖండించండి

23-03-2025 05:47:27 PM

సిపిఎం..

ఇల్లెందు (విజయక్రాంతి): తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం హైదారాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద కార్యక్రమానికి వెళుతున్న ఆశ, మధ్యాహ్న భోజన కార్మికులను ఇల్లందు పోలీసులు అరెస్టు చేయడాన్ని సిపిఎం పార్టీ ఇల్లందు మండల కమిటీ ఖండించింది. హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద ఆందోళన కార్యక్రమానికి రాష్ట్ర పోలీసులు పర్మిషన్ ఇచ్చినాక ఇక్కడ ముందస్తు అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం కాదని సీపీఎం పార్టీ జిల్లా నాయకులు అబ్దుల్ నబీ, పార్టీ మండల కార్యదర్శి ఆలేటి కిరణ్ కుమార్ లు అన్నారు.

తమకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కనీస వేతనం, పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో పాటు అశాలకు రూ. 18వేలు, మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10 వేలు వేతనం ఇస్తామని మ్యానిపెస్టోలో పెట్టిన పాలకులు ఏడాదిన్నర అయినా అమలు చేయకపోవడం సరికాదని అన్నారు. ఆ సమస్య సాధన కోసం సీఐటీయూ ఆద్వర్యంలో చలో హైదరాబాద్ వెళుతున్న స్కీమ్ వర్కర్లను వెళ్లకుండా ఎక్కడికక్కడ పోలీసులు నిర్భందించం అప్రజాస్వామిక చర్య అని అన్నారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని వారు అన్నారు.