26-03-2025 01:02:42 AM
* సీఐటీయూ జిల్లా నాయకుడు సుంకర సుధాకర్
వైరా, మార్చి 25:- మండుతున్న ఎర్రటి ఎండలో మానవహారం. సోమవారం హైదరాబాద్ లో శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఆశ వర్కర్లను రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించి ఆడబిడ్డలైన ఆశ వర్కర్లను అతి కిరాతకంగా హింసించి అరెస్టు చేయడాన్ని ఖండించాలని సిఐటియూ జిల్లా నాయకులు సుంకర సుధాకర్, వైరా పట్టణ కన్వీనర్ అనుమోలు రామారావు అన్నారు.
అరెస్టులను నిరసిస్తూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం సిఐటియూ వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు ప్రభుత్వ ఆసుపత్రి నుండి నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండుతున్న ఎర్రటి ఎండలో మానవహారం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐటియూ జిల్లా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం ఆశా వర్కర్లకు ఫిక్సుడ్ వేతనం 18 వేల రూపాయలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని హైదరాబాదులో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంలో ఆశ వర్కర్లను ఎక్కడికక్కడే అరెస్టు చేసి బంధించారని తెలిపారు.
హైదరాబాదులో శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న ఆశా వర్కర్లను అతి కిరాతకంగా అరెస్టు చేసే సమయంలో పలువురు ఆశా వర్కర్లకు గాయాలు అయ్యాయని అవేదన వ్యక్తం చేశారు. . ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు శైలజ, సుజాత, ప్రమీల, రేణుక, ఆదిలక్ష్మి, హైమావతి, సునీత, దీప, వెంకటరమణ, నాగేంద్ర విజయ తదితరులు పాల్గొన్నారు.