04-04-2025 12:33:22 AM
పెద్దపల్లి ఏప్రిల్- 3(విజయక్రాంతి): మండలంలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం కలెక్టర్ అంతర్గాం మండలంలో విస్తృతంగా పర్యటించారు. మండల రెవెన్యూ అధికారి కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజీవ్ యువ వికా సం పథకం కింద ఆఫ్ లైన్ దరఖాస్తులను స్వీకరించాలని, వాటిని ఆన్‌లైన్‌లో పకడ్బం దీగా నమోదు చేయాలని సూచిం చారు. 102 వాహనాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం గర్భిణీ స్త్రీలను చెకింగ్ కు తీసుకొని రావాలన్నారు.
డయాగ్నొస్టిక్ హబ్ ద్వారా ఉచిత పరీక్షలు నిర్వహించాలని అన్నారు. మండలి రెవెన్యూ అధికారి కార్యాలయంలో రికార్డుల నిర్వహణ కట్టుదిట్టం చేయాలని, ప్రజావాణి ద్వారా వచ్చే దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కలెక్టర్ వెంట ఎంపిడిఓ వేణు మాధవ్, వైద్యాధికారి డాక్టర్ ఉదయ కిరణ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.