బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో ఆదిలాబాద్ జిల్లా స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన అండర్ 19 బాలుర, బాలికల రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలు అట్టహాసంగా ముగిశాయి. ఈ పోటీల్లో బాలికల విభాగంలో నిజామాబాద్ జిల్లా ప్రధమ స్థానం సాధించగా, మెదక్ రెండవ స్థానం, మహబూబ్ నగర్ మూడవ స్థానం సాధించాయి. బాలుర విభాగంలో మెదక్ మొదటి స్థానం, ఆదిలాబాద్ రెండవ స్థానం, నిజామాబాద్ మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. పోటీల్లో ప్రతిభ చూపిన విజేతలకు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, బెల్లంపల్లి వన్ టౌన్, తాండూర్ సిఐ దేవయ్య, కుమారస్వామిలు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి బి. బాబురావు, కన్వీనర్ కె. అంజయ్య, అబ్జర్వర్లు గంగ మోహన్, శంకర్, కోఆర్డినేటర్ ఎన్ స్వామి. వ్యాయామ ఉపాధ్యాయులు కె.రామ్మోహన్ రావు, ఎండి యాకూబ్, చాంద్ పాషా, బండి రవి, రాజ్ మహమ్మద్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, సంతోష్, చిన్నక్క తదితరులు పాల్గొన్నారు.