calender_icon.png 3 February, 2025 | 9:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన సింగరేణి సేవాసమితి ఉచిత ఉపాధి శిక్షణ తరగతులు

03-02-2025 06:49:54 PM

ఇల్లెందు (విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియాలోని వై.సి.ఓ.ఎ క్లబ్ లో సింగరేణి సేవాసమితి ఇల్లందు ఏరియా ఆధ్వర్యంలో వివిధ రకాల ఉచిత శిక్షణ తరగతుల కొరకు దరఖాస్తు చేసుకున్న 175 మంది మహిళలకు నిర్వహించిన  శిక్షణ తరగతులు సోమవారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ఇల్లందు ఏరియా సేవా అధ్యక్షురాలు వి.రమ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... నిరుద్యోగ యువతీ యువకులకు సింగరేణి సేవాసమితి చేపడుతున్న ఉపాధి అవకాశాలను అందరు సద్వినియోగం చేసుకోని స్వయం ఉపాది పొంది తమ కుటుంబాలను పోషించుకోవాలని అలాగే మహిళలు అన్నిరంగాలలో ముందుండాలని స్వయం ఉపాధి కోసం సేవాసమితి అందిస్తున్న అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. తదుపరి శిక్షణ కాలంలో శిక్షకులు తయారుచేసిన వివిధ రకాల డిజైన్ వస్త్రాలను, వారి రికార్డులను తనిఖీ చేసి వారిని అభినందించారు. ఈ కార్యక్రమమునకు డి.జి.యం.(పర్సనల్) జి.వి.మోహన్ రావు, కోఆర్డినేటింగ్ ఆఫీసర్ సాయి స్వరూప్, సేవా కార్యదర్శి సులక్షణ, ఇతర సేవా సమితి సభ్యులు, ట్రైనర్లు, శిక్షకులు పాల్గొన్నారు.