24-02-2025 12:25:52 AM
బాన్సువాడ, ఫిబ్రవరి 23( విజయ క్రాంతి), :కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న నల్లపోచమ్మ ప్రతిష్ట ఉత్స వాలు ఆదివారం ముగిసాయి. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు. చండీహోమము సామూ హిక కుంకుమార్చనతో పాటు పోచమ్మ విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరుపాక్ష విద్యారణ్య మహా సంస్థాన పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విద్యా రణ్య భారతి స్వామి మంత్రోచ్ఛరణాల మధ్య పోచమ్మ ప్రాణ ప్రతిష్ట కార్యక్ర మాన్ని నిర్వహించారు.
భక్తులు పెద్ద ఎత్తు న పాల్గొని ఈ కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు దిగ్విజయంగా నిర్వహించినందుకు అమ్మవారి ఆశీర్వాదం అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన పూజారి జంపాల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కార్య క్రమాలు నిర్వహించారు. బేతాళ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు హనుమంతరావు పటేల్ బసవరాజ్ అప్ప గాజుల రాజులు బాలకృష్ణ కిరణ్ చంద్ర గౌడ్ రమేష్ మామిండ్ల రాజు మల్లి కార్జున అప్ప రవి హనుమాన్లు సోమయ్య చారి విట్టల్ కృష్ణారెడ్డి అంజిరెడ్డి మాసాని శ్రీనివాస్ రెడ్డి సూర్యకాంతం పంతులు తదితరులు పాల్గొన్నారు.