calender_icon.png 1 November, 2024 | 10:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన హ్యాక్ ఎక్సిలరేట్ హ్యాకతాన్

28-04-2024 02:24:42 AM

రాజేంద్రనగర్, ఏప్రిల్ 27: చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ)లో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌ఎల్ నేతృత్వం లో చేపట్టిన హ్యాక్ ఎక్సిలరేట్ 2024 కార్యక్రమం ముగిసింది. దేశవ్యాప్తంగా రెండు వేల మందికి పైగా ఇంజినీరింగ్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ హ్యాకథాన్‌లో రూ.1.50లక్షల నగదు బహుమతిని అనురాగ్ యూనివర్సిటీకి చెందిన కోడ్ సారథి టీం సొంతం చేసుకుంది. సీబీఐటీకి చెందిన ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ బృందం రూ.75 వేల విలువైన బహుమతి, మహారాష్ట్రకు చెందిన ఎన్‌కే ఆర్కిడ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీకి చెందిన టీమ్ టెక్ ఏఐకు రూ.50 వేల విలువైన మూడో బహుమతి దక్కింది.

ఈ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్ కన్సల్టెంట్ శ్రీఆదిత్య సలాడి, బైట్ ఎక్స్‌ఎల్ సీఎస్‌వో, సహ వ్యవస్థాపకుడు చరణ్ తాడేపల్లి, సీబీఐటీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పీవీ నర్సింహులు, సీబీఐటీ కెరీర్ డెవలప్మెంట్ కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్‌ఎల్‌ఎన్‌రెడ్డి, సీబీఐటీ అకాడెమిక్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ సుశాంత్‌బాబు తదితరులు పాల్గొన్నారు.