calender_icon.png 30 October, 2024 | 7:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ క్రీడలు

30-10-2024 05:03:00 PM

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

మెదక్ డీఈఓ డా. రాధా కిషన్

పాపన్నపేట: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు పాపన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో బుధవారం ఘనంగా ముగించారు. రెండు రోజులపాటు జరిగిన ఈ క్రీడల్లో జిల్లాలోని అన్ని మండలాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. కాబట్టి బాలురు అండర్ 14 విభాగంలో హవేలీ ఘనపూర్ జట్టు ప్రథమ స్థానంలో, నర్సాపూర్ జట్టు ద్వితీయ స్థానంలో, అండర్ 17 విభాగంలో మెదక్ జట్టు ప్రథమ స్థానంలో,  అల్లాదుర్గం జట్టు ద్వితీయ స్థానంలో నిలిచాయి. బాలికలు అండర్ 14 విభాగంలో చేగుంట జట్టు ప్రథమ స్థానంలో, కొల్చారం జట్టు ద్వితీయ స్థానంలో నిలువగా, అండర్ 17 విభాగంలో కౌడిపల్లి ప్రథమ స్థానంలో కొల్చారం ద్వితీయ స్థానంలో నిలిచాయి. ఈ సందర్భంగా గెలుపొందిన విజేతలకు జిల్లా విద్యాధికారి రాధా కిషన్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఈఓ రాధాకృష్ణ మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలో రాణిస్తూ రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరచాలి అన్నారు. చదువుతోపాటు ఆటలు కూడా ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక హెచ్ఎం మహేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.