calender_icon.png 25 October, 2024 | 4:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రకృతిలో లభించే వాద్యం!

29-05-2024 12:05:00 AM

ఇది ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో వాడుకలో ఉంది. ఇది సంగీత వాద్యం కాదు. ప్రకటన వాద్యం. పౌరాణిక వాద్యమే గానీ ప్రకృతిలో లభించే వాద్యం. చిన్న మార్పుతో అతిపెద్ద శబ్దాన్ని సృష్టించే వాద్యం. మనదేశంలో కూడా అన్ని ప్రాంతాలలో దీనిని ఉపయోగిస్తారు. హిమాలయ పర్వత శ్రేణుల నుండి సముద్రాలు లోతట్టు ప్రాంతాల వరకు దీని శబ్దం మారుమ్రోగుతుంటుంది. దీనిని సంగీత వాద్యంగా కన్నా శబ్ద వాద్యంగా సంగీతకారులు ఎక్కువగా గుర్తిస్తారు.

మనుషులు సుస్వారాలనే సంగీతంగా భావిస్తారు. ఏదో ఒక రీతిలో ఔపయోగిక శబ్దంగా ఉంటేనే దానిని స్వీకరించారు. విషాదం, మరణం, బాధ, ఆవేదన వీటి ప్రతి రూపాలను దూరం పెడతారు. అన్నిరకాల పూజలలో, జానపద నృత్యాలతో శబ్దాలలో శంఖుది ప్రధాన స్థానం. దీనిని ఒకటిగా, సామూహికంగా జానపద వాద్య ప్రదర్శనలలోను ఉపయోగిస్తారు. యుద్ధారంభ సూచికగా మోగిస్తా రు. రాజస్థానాలలో శుభ సూచికంగా మోగిస్తారు. కార్యక్రమం ప్రారంభించే ముందు దీనిని ఊదుతారు. ఒగ్గు కథలో, ఇతర జానపద ప్రదర్శనలలో, కర్మకాండలలో దీనిని ఉపయోగిస్తారు. ముఖ్యంగా గుడిలో సాంప్రదాయిక ఆచారంగా మోగిస్తారు.

ఆలయాలలో, పవిత్ర కార్యాలలో మోగించే పంచమహా శబ్దాలలో శంఖం ఒకటి. అంటే ఆ అయిదు మంగళ వాద్యాలలో దీనిని ఒకటిగా గుర్తించారు. శుభసూచక సందర్భాలలో, సంతోషకరమైన ఉత్సవాలలో శంఖుధ్వని తప్పనిసరి. ప్రాచీన కాలంలో వేదాల్లో, రామాయణంలో, భాగవతంలో శంఖం ప్రస్తావన కనిపిస్తుంది. పాంచజన్య శంఖం ఊదే శ్రీకృష్ణుడు దానవ సంహారం చేసినవాడిగా గుర్తింపబడినాడు. విష్ణువు ఒక చేతిలో శంఖం ఉంటుంది. దానవులను మరో చేతిలో గల చక్రంతో సంహరిస్తాడు. ఈ కాలంలో అదే శంఖంతో ప్రజాకంట కులను ఎదిరించడానికి కొత్త ధ్వనితో సమర శంఖం పూరించే పని మొదలు కావాలని ఎక్కడ శంఖ నాదం విన్నా అనిపిస్తుంది.