calender_icon.png 19 October, 2024 | 2:06 PM

మెట్రో ప్రయాణికులకు రాయితీ

19-10-2024 12:21:17 AM

‘మనయాత్రి’ సంస్థతో ఎల్‌అండ్‌టీ భాగస్వామ్యం

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 18(విజయక్రాంతి) : మెట్రో ప్రయాణికులకు ఫస్ట్‌మెయిల్, లాస్ట్ మెయిల్ కనెక్టివిటీని పెంచేందుకు ‘మనయాత్రి’ అనే సంస్థతో ఎల్‌అండ్‌టీ మెట్రో భాగస్వామ్యమయినట్లు  ఎల్‌అండ్‌టీ ఎండీ కేవీబీరెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఎల్‌అండ్‌టీ మెట్రో అధికారులు మనయాత్రి సీఈవో మాగిజన్ సెల్వన్‌తో కలిసి టీహబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కేవీబీరెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ మెట్రో ద్వారా ప్రతిరోజు 5లక్షల మంది ప్రయాణిస్తున్నారన్నారు. మనయాత్రితో ఎల్‌అండ్‌టీ మెట్రో భాగస్వామ్యం మంచి ఫలితాల నిస్తుందని ఆశించారు. మనయాత్రి సీఈవో మాగిజన్ సెల్వన్ మాట్లాడుతూ.. తమ సంస్థ బెంగు ళూరు, కొచ్చిలో సేవలందించిందని, ఇప్పుడు హైదరాబాద్ మెట్రోతో కలిసి సేవలందించబోతోందన్నారు.

మనయాత్రి యాప్‌లో.. రైడ్స్ నిర్వహించే మెట్రో ప్రయాణికులకు ఆ సంస్థ 10శాతం రాయితీని కల్పిస్తోందని, డ్రైవర్లకు నేరు గా డబ్బులు చెల్లిస్తుందని స్పష్టం చేశారు. లాస్ట్ మెయిల్ కనెక్టివిటీలో ప్రయాణికులకు మంచి అవకాశమని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ఎస్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎల్‌అండ్‌టీ మెట్రో అధికారులు మురళీ వరదరాజన్, సుధీర్, పి.రవిశంకర్, అల్లూరి శర్మ, సుదీప్తోరంజన్, రిషివర్మ తదితరులు పాల్గొన్నారు.