24-04-2025 11:31:26 PM
హాస్టల్‌లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): కోఠిలోని వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ గురువారం విద్యార్థినులు ఆందో ళన బాట పట్టారు. వీసీ ఛాంబర్ ఎదుట బైఠాయించారు. తమ సమస్యలపై వీసీ నిర్లక్ష్యం వహి స్తున్నారని ఆరోపించారు.
ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ.. తమ హాస్టల్‌లో మంచినీరు, టాయిలెట్స్ సరిగా లేవన్నారు. క్యాంపస్‌లో పాములు, ఎలుకలు, కుక్కలు తిరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీసీ దృష్టికి తీసుకెళితే హెలికాప్టర్లు పంపిస్తామంటూ ఎద్దేవా చేశారని విమర్శించారు.