విజయక్రాంతి న్యూస్ నెట్వర్క్, నవంబర్ 9: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. నియోజకవర్గ కేంద్రా ల్లో ర్యాలీలు, రాస్తారోకోలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. హింసను ప్రేరేపించేలా మాట్లాడుతున్న సీఎంపై కేసులు నమోదు చేయాలని పలు పోలీస్ స్టేష్టన్లలో ఫిర్యాదు చేశారు.