calender_icon.png 24 January, 2025 | 3:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామసభల్లో ఆందోళన

24-01-2025 12:00:00 AM

మేడ్చల్, జనవరి 23 (విజయక్రాంతి): మేడ్చల్ మండలంలోని రెండు గ్రామాలలో గ్రామసభలు రసాభాసగా జరిగాయి. నూతనకల్, శ్రీరంగవరం గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో అధికారులను నిలదీశారు. అనర్హుల పేర్లు జాబితాలో ఉన్నాయన్నారు. ఘట్కేసర్ మండలం ఎదులాబాదులోనూ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో మహిళలు అధికారులను నిలదీశారు. దీంతో అధికారులు వెళ్లిపోయారు.