11-02-2025 11:35:37 PM
ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పాత జాతీయ రహదారిపై శవంతో రాస్తారోకో చేయడంతో ఆందోళన నెలకొంది. ఆదిలాబాద్ లోని చిలుకూరి లక్ష్మీ నగర్ కాలనీకి చెందిన మారుతి అనే లారీ డ్రైవర్ జార్ఖండ్ లో మృతి చెందాడు. మారుతి ఎలా చనిపోయాడో తమకు తెలియదని, లారీ ఓనర్ పట్టించుకోవడం లేదని మంగళవారం రాత్రి తిర్పెల్లి కాలనీ పాత జాతీయ రహదారిపై మృతిని కుటుంబ సభ్యులు శవంతో రాస్తారోకో చేపట్టారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దింతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను సముదాయిస్తున్నారు