బెల్లంపల్లి (విజయక్రాంతి): తమ గ్రామంలో నాటుసారా నిషేధించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలం లింగాల గ్రామస్తులు బ్లాక్ కార్డులతో గ్రామంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. నాటుసారా వల్ల గ్రామంలో అనేకమంది మద్యానికి బానిసై రోడ్డున పడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే నాటుసారాను నిషేధించాలని కోరారు. గ్రామంలోని యువత, మహిళలు, వృద్ధులు సమిష్టిగా నాటు సారా నిషేధించాలని నినదించడం వారి ఐక్యతను చాటింది. నాటుసారా అమ్మే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. అనంతరం బ్లాక్ కార్డులతో గ్రామంలో నిరసన ర్యాలీ చేపట్టారు.