కూకట్‌పల్లి, అక్టోబర్ 21: కూకట్‌పల్లిలోని అమృత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ మెడికల్ సైన్స్ విద్యార్థులు సోమవారం కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. తమ తల్లిదండ్రులు వేలాది రూపాయలు కాలేజీ యాజమాన్యానికి చెల్లిస్తే తమ కోర్సు పూర్తయినా ఇప్పటికీ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
తమ సర్టిఫికెట్లు ఇప్పించాలని ఉదయం నుంచి సుమారు 150 మంది విద్యార్థులు పోలీస్ స్టేషన్ వద్ద పడిగాపులు కాశా రు. పోలీసులు కాలేజీ యాజమాన్యం తో మాట్లాడగా తమకు మూడు రోజు లు గడువు కావాలని యాజమాన్యం పోలీసులతో పేర్కొంది. పోలీసులు సర్దిచెప్పడంతో విద్యార్థులు ఆందోళనను విరమించారు.