19-03-2025 05:34:27 PM
ప్రమాదవశాత్తు బావిలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. డ్రైవర్ మృతి
వైరా (విజయక్రాంతి): బోనకల్ మండల పరిధిలోని సీతానగరం గ్రామం మధిర రోడ్డు ప్రక్కన ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి అదుపు తప్పి దూసుకెళ్ళింది. పాలడుగు గ్రామానికి చెందిన గ్రామానికి కంచపోగు మంగరాజు బావిలో పడి మృతి చెందడంతో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ దాదాపు 100 మందిపైగా కుటుంబ సభ్యులు స్థానికులు సంఘటన స్థలానికి చేరుకొని.. సంబంధిత రైతు వనమా చిన్న సత్యనారాయణ ఇంటివద్ద మృతదేహాన్ని పడుకోబెట్టి న్యాయం చేయాలనీ కోరుతున్నారు. బోనకల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.