28-04-2025 12:59:28 AM
పటాన్ చెరు, ఏప్రిల్ 27 : తెల్లాపూర్ ము న్సిపల్ పరిధిలోని బీహెచ్‌ఈఎల్ ఎంప్లాయిస్ సైబర్ కాలనీలో అక్రమ అపార్ట్ మెం ట్ నిర్మిస్తున్నారని అక్కడి నివాసితులు ఆదివారం శాంతియుత నిరసన తెలిపారు. హెచ్‌ఎండీఏ ఆమోదించిన లే అవుట్ ప్రకా రం ఆ స్థలం వాణిజ్య సముదాయానికి కేటాయించగా రెసిడెన్షియల్ కాంప్లెక్స్ చేపట్టా రని వారు ఆరోపించారు. మున్సిపల్ అధికారుల అండదండలతో నిబందనలకు విరు ద్దంగా నిర్మాణాలు జరుగుతున్నాయని వా రు పేర్కొన్నారు.
గేటెడ్ కమ్మూనిటీ సొసైటీ ప్రెసిడెంట్, సొసైటీని సభ్యులను సంప్రదించకుండా..ఎలాంటి ఎన్‌ఓసీ లేకుండా నిర్మాణం జరుగుతుందన్నారు. ప్లాన్ లేకుం డా బిల్డింగ్ వద్దు...మా భవిష్యత్తు నాశనం చేయొద్దు అంటూ నినాదాలు చేశారు. అక్ర మ నిర్మాణాన్ని అడ్డుకొని మున్సిపల్ అధికారులుతగు చర్యలు తీసుకోవాలనికోరారు.