జనగామలో జగన్ దిష్టిబొమ్మ దహనం
జనగామ, సెప్టెంబర్ 22(విజయక్రాంతి): తిరుమలలో లడ్డూ కల్తీ కావడాన్ని నిరసిస్తూ జనగామలో హిందూ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఏపీ మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. కోట్లాది మంది పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి లడ్డూను అపవిత్రం చేయడం హేయమైన చర్య అన్నారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.