calender_icon.png 25 October, 2024 | 3:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుద్యాల మండలంలో ఫార్మా భూ రైతుల ఆందోళన

25-10-2024 01:24:02 PM

దుద్యాల మండలం రోటి బండ తాండలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని నిర్భందించిన తాండ వాసులు..

పరిస్థితి ఉద్రిక్తం.. రంగంలోకి పోలీసులు..

కొడంగల్ (విజయక్రాంతి): దుద్యాల మండలంలోని లగచర్ల పోలేపల్లి గ్రామాలలో ఫార్మా ఏర్పాటులో భూములు కోల్పోతున్న రైతుల అభిప్రాయాన్ని సేకరించేందుకు నేడు ఆయా గ్రామాల రైతులతో సమావేశయం అయ్యేందుకు జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ హాజరు కానుండటంతో రోడ్లపైకి ఆందోళన చేసేందుకు రైతులు వచ్చారు. దుద్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అవిటి శేఖర్ సమావేశానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ నుండి లగచర్ల వెళ్తుండగా రోటిబండ తాండలోని గిరిజన రైతులు ఆయనకు అడ్డుపడి ప్రశ్నించగా ఫార్మకు తమ భూములు ఇవ్వాలని డిమాండ్ చేయగా అగ్రహించిన రైతులు శేఖర్ పై దాడికి పాల్పడ్డారు. తాండలోని గ్రామ పంచాయతీ భవనంలో ఆయనను నిర్భందించారు. తమ భూములు తమకు కావాలని ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉదృతంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు రైతుల ఆందోళనను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. బొంరాస్ పేట్ ఎస్ఐ అబ్దుల్ రహుఫ్ రెండు చేతులు జోడించి ఆందోళన విరమించాలని రైతులను వేడుకున్నారు.