calender_icon.png 28 November, 2024 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూనిర్వాసితుల ఆందోళన

25-09-2024 02:30:19 AM

గజ్వేల్, సెప్టెంబర్ 24: ఇచ్చిన హామీ లు అమలయ్యాకే పరిశ్రమల నిర్మా ణం చేపట్టాలని వర్గల్ పారిశ్రామిక ప్రాంత భూనిర్వాసితులు చేపట్టిన ఆందోళన రెండోరోజు కొనసాగింది. వర్గల్ మం డల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ కార్పొరేషన్‌కు కేటాయించిన పారిశ్రామిక భూముల్లో నిర్మాణాలు చేపడుతున్న కంపెనీల పనులను నిర్వాసిత రైతులు  మంగళవారం అడ్డుకొని ఆందోళన నిర్వహించారు.

గత ప్రభుత్వం ఎకరాకు రూ.10లక్షల నష్టపరిహారాన్ని అందించడంతో పాటు ప్రతి రైతుకు నివాస స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చిందన్నారు. అయితే ఇప్పటివరకు అది పూర్తిస్థాయిలో నెరవేరలేదని... హామీలన్నీ అమలయ్యాకనే నిర్మాణ పనులు కొనసాగించాలని స్పష్టం చేశారు. రైతులు గోవర్ధన్‌రెడ్డి, నర్సారెడ్డి, రమేష్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.