- పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 9 (విజయక్రాంతి): డీఎస్సీని వాయిదా వేయాలని, 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సోమవారం అర్ధరాత్రి ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట డీఎస్సీ అభ్యర్థులు నిరసన తెలిపారు. డీఎస్సీ కోసం 90 రోజుల సమయమివ్వాలని ప్లకార్డులు ప్రదర్శించారు. సోమవారం వేకువజాము వరకు ఆర్ట్స్ కాలేజీ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. వాయిదా వేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కాగా డీఎస్సీని వాయిదా వేయాలని సోమవారం ఆర్ట్స్ కాలేజీ ఎదుట బీఆర్‌ఎస్వీ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. బీఆర్‌ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు మాట్లాడుతూ.. డీఎస్సీ నిర్వహణలో నిరుద్యోగులను పట్టించుకోకుండా ప్రభుత్వం మొండిగా వ్యవ హరిస్తోందన్నారు. కనీసం రెండు నెలల సమ యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో నిర్వహించిన గురుకులాల అభ్యర్థులకు కాంగ్రెస్ ఉద్యోగాలిచ్చి పోస్టింగ్‌లు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో స్వామియాదవ్, దశరథ్, విజయ్, చందు, జంగయ్య పాల్గొన్నారు.