calender_icon.png 11 January, 2025 | 6:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబుల్ బెడ్‌రూమ్ లబ్ధిదారుల ఆందోళన

22-10-2024 02:36:13 AM

గజ్వేల్, అక్టోబర్21: గజ్వేల్ పూర్ మున్సిపాలిటీ డబుల్ బెడ్‌రూం ఇండ్ల లబ్ధిదారుల గొడవ మరోసారి రచ్చకెక్కింది. తమకు కేటాయించిన ఇండ్లను అప్పగించాలంటూ లబ్ధిదా రులు సోమవారం ఆర్డీవో కార్యాల యానికి చేరుకొని నిరసన వ్యక్తం చేశా రు. దాదాపు గంటన్నరపాటు లబ్ధిదా రుల నిరసన కొనసాగింది. కార్యాల యంలోకి వెళ్లకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆర్డీవో బన్సీలాల్ లబ్ధిదారులతో మాట్లాడు తూ.. సర్వే పూర్తికాగానే మిగిలిన ఇండ్ల ను అప్పగించడంతో పాటు పట్టాలు పంపిణీ చేస్తామన్నారు.