calender_icon.png 2 February, 2025 | 10:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర బడ్జెట్ పై కామ్రేడ్ల నిరసన

02-02-2025 07:17:42 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మిక సంస్కరణలను వ్యతిరేకిస్తూ, 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలన్నారు. కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వ్యవసాయ, కార్మిక, కర్షకుల ఏమాత్రం లాభం లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టాలని విమర్శించారు. తెలంగాణపై కేంద్రం మొండి చేయి చూపిందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక, ఆర్థిక సంస్కరణల కొనసాగింటే ఈ బడ్జెట్ అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు రాజేందర్ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు టికానంద్, టిఏజిఎస్ జిల్లా అధ్యక్షురాలు మాల శ్రీ తదితరులు పాల్గొన్నారు.