12-03-2025 01:08:19 AM
సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ నేత సాధినేని వెంకటేశ్వరరావు
ఖమ్మం,మార్చి 11( విజయక్రాంతి ): ప్రతిఘటన పోరాట యోధుడు సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన రాయల సుభాష్ చంద్రబోస్(రవన్న) తొమ్మిదవ వర్ధంతి సభ మంగళవారం ఆవునూరి మధు అధ్యక్షతన భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించారు.
ముందుగా ఖమ్మం నగరంలోని జిల్లా పరిషత్ సెంటర్ నుండి ప్రారంభమైన ప్రజా ప్రదర్శన వైరా రోడ్డుమీదుగా పాత బస్టాండ్, రిక్కబజార్ హైస్కూల్ గ్రౌండ్ మయూరి సెంటర్ మీదుగా భక్తరామదాసు కళాక్షేత్రంకు చేరుకున్నది. ప్రజా ప్రదర్శన అగ్రభాగాన సిపిఐ(ఎంఎల్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి పి ప్రసాద్ , తెలంగాణ అధికార ప్రతినిధి ఎస్ వెంకటేశ్వరరావు , ఏఐకేఎంఎస్ గౌరవ అధ్యక్షులు వి కోటేశ్వరావు, ఐఎఫ్ టి యు రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీనివాస్, గౌని ఐలయ్య, బండార ఐలయ్య, పి ఓ డబ్ల్యు ఝాన్సీ, మంగ తదితరులు నాయకత్వం వహించారు.
అనంతరం భక్త రామదాసు కళాక్షేత్రంలో జరిగిన సభలో సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి పి ప్రసాద్ మాట్లాడుతూ, సూక్ష్మస్థాయిలో సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీకి చెందినవాడు అలాంటి విప్లవకారుడి వర్ధంతి సభ జరిపి హక్కు తమ పార్టీకి తప్ప మరెవరికి లేదనడం, అనవసర చర్చ చేయడం మాస్ లైన్ పార్టీకి తగదని హితవు చెప్పారు. ప్రజల హక్కులు కాపాడుకోవడానికి సమరశీల శక్తుల ఐక్యత నేడు అవసరం అన్నారు.ఈ సభలో సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ వి కోటేశ్వరరావు, అరుణోదయ నాగన్న, గౌని ఐలయ్య, డేవిడ్ కుమార్ ,బండారు ఐలయ్య, విప్లవ కుమార్, గౌని నాగేశ్వరరావు, రాజేంద్రప్రసాద్, కోలా లక్ష్మీనారాయణ, జజ్జుర్ వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.