calender_icon.png 27 November, 2024 | 9:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామ్రేడ్​ పోటు ప్రసాద్​ మృతి పార్టీకి తీరని లోటు

27-11-2024 06:43:48 PM

సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రచారి

అబ్దుల్లాపూర్​మెట్​: సీపీఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ విద్యార్థి నాయకుడు కామ్రేడ్​ పోటు ప్రసాద్ బుధవారం మార్నింగ్​ వాక్​కు వెళ్లి గుండెపోటు వచ్చి అక్కడిక్కడే మృతి చెందడం చాలా బాధకారం.​ ఈ సందర్భంగా అబ్దుల్లాపూర్​మెట్​ మండల కార్యాలయం వద్ద ప్రసాద్​ చిత్రపటానికి పూలమాలలు వేసి జోహర్లు అర్పించారు. అనంతరం సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రచారి మాట్లాడుతూ.. కామ్రేడ్​ ప్రసాద్​ అకాల మరణం పార్టీకి తీరని లోటన్నారు. ఆయన అనేక ప్రజా ఉద్యమాలలో చురుకుగా పాల్గొనేవారు అని కొనియాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం చివరి శ్వాస విడిచే వరకు ఎర్రజెండా పక్షాన పోరాడిన వ్యక్తి ప్రసాద్​ అని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాది రెడ్డి, రంగారెడ్డి జిల్లా సీపీఐ పార్టీ కౌన్సిల్ సభ్యులు పబ్బతి లక్ష్మణ్, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు అజ్మీర హరిసింగ్ నాయక్, ప్రసాద్, మధు, పుల్లయ్య, నిరంజన్, సైదులు, యాదగిరి, వినోద్ నాయక్, శ్రావణి, పార్వతి, నవీన్ పార్టీ శ్రేణులు, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.