calender_icon.png 3 April, 2025 | 1:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామ్రేడ్ ఆవుల వెంకన్న జీవితం విప్లవోద్యమానికి అంకితం

01-04-2025 12:00:00 AM

సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి 

 మహబూబాబాద్ , మార్చి 31: (విజయ క్రాంతి) మహబూబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన సిపిఐ(ఎం) పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి, కామ్రేడ్ ఆవుల వెంకన్న సంతాప సభ సిపిఐ(ఎం) పార్టీ మండల కమిటీ సభ్యులు  కావటి నరసయ్య అధ్యక్షతన సోమవారం జరిగిన సంతాప సభలో సిపిఐ(ఎం) పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి పాల్గొని మాట్లా డుతూ కామ్రేడ్ ఆవుల వెంకన్న తన చిన్నతనం నుండే బిల్డింగ్ రంగంలొ పనిచేస్తూ ఎర్రజెండా నీడలో పెరిగి ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన వారి హక్కుల  కోసం అనేక పోరాటాలు నిర్వహించిన పోరాట యోధుడు కామ్రేడ్ ఆవుల వెంకన్న అని కొనియాడారు.

ఈ సందర్భంగా కామ్రేడ్ ఆవుల వెంకన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళుల ర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సిపిఐ(ఎం) పార్టీ ములుగు జిల్లా కార్యదర్శి బిరెడ్డి సాంబశివ, మహబూబాబాద్ జిల్లా సిపిఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గునిగంటి రాజన్న,జిల్లా కమిటీ సభ్యులు మారుతినేని పాపారావు,మండల కార్యదర్శి గొడిశాల వెంకన్న,మండల కమిటీ సభ్యులు బొబ్బల యాకూబ్ రెడ్డి, చాగంటి కిషన్,సోమారపు ఎల్లయ్య,పొన్నాల జ్యోతి,సిఐటియు మండల అధ్యక్ష  కార్యదర్శులు తాడ బోయిన శ్రీశైలం  జల్లే జయరాజు తదితరులు పాల్గొన్నారు.