ఐడీబీఐ సీఎస్‌ఆర్ నిధులతో సామగ్రి అందజేత
ఎల్బీనగర్, ఫిబ్రవరి 1: మన్సూరాబాద్ డివిజన్ లోని ప్రభుత్వ జిల్లా పరిషత్ హై స్కూల్, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలకు ఐడీబీఐ బ్యాంక్ తన సీఎస్‌ఆర్ నిధులతో కంప్యూటర్లు, ఇతర సామాగ్రి అందజేసింది. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి విజ్ఞప్తితో ఐడీబీఐ బ్యాంక్ అధికారులు సీఎస్‌ఆర్ నిధులు మంజూరు చేసింది.
రూ, 1.75 లక్షలతో మూడు కంప్యూటర్లు, ప్రింటర్స్, టేబుల్స్ ను శనివారం కార్పొరేటర్ నర్సింహరెడ్డి, ఐడీబీఐ ఎల్బీనగర్ బ్రాంచ్ మేనేజర్, డీజీఎం మైకేల్ తదితరులు ప్రధానోపాధ్యాయులు శ్యామ్ సుందర్ రెడ్డి, కవితారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ మైకేల్ మాట్లాడుతూ.. పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం కంప్యూటర్ పరికరాలు అందజేశామన్నారు.
కార్పొరేటర్ నర్సింహరెడ్డి మాట్లాడుతూ.. నేను చదువుకున్న మన్సూరాబాద్ ప్రభుత్వ పాఠశాలను సీఎస్‌ఆర్ నిధులకు ఐడీబీఐ బ్యాంక్ ఎంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్స్, ప్రింటర్స్, ఇతర పరికరాలను అందజేస్తున్నందుకు ఐడీబీఐ మేనేజర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఐడీబీఐ రీజనల్ ఆఫీసర్ హరికృష్ణ, ఏజీఎం మాధవి, సుధీర్, హై స్కూల్ ఇన్ చార్జి రామలింగం, అసిస్టెంట్ సిద్దు, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు హరీశ్ రెడ్డి, నాయకులు యాంజల్ జగన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.