26-04-2025 01:01:05 AM
మార్వాడి శిక్షాసమితికి అందజేత
హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): హైదరాబాద్ చాదర్‌ఘాట్‌లోని మార్వాడి శిక్షా సమితికి చెందిన హెడా మోడల్ హైస్కూల్‌కు శుక్రవారం ప్రముఖ మల్టీ-స్టేట్ షెడ్యూల్ బ్యాంక్ అయిన ఆంధ్రప్రదేశ్ మహేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ సీఎస్‌ఆర్ కార్యాచరణ కింద 10 కంప్యూటర్లను విరాళంగా అందజేశారు. బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో వి. అరవింద్ సమక్షంలో బ్యాంక్ డైరెక్టర్లు అనితా సోని, సీఏ ఎస్‌బి కాబ్రా కంప్యూటర్లను అందజేశారు.
ఈ సందర్భంగా బ్యాంక్ డైరెక్టర్ అనితా సోని మాట్లాడుతూ.. బ్యాంక్ యాజమాన్యం, సిబ్బంది పనితీరును, బ్యాంక్ లాభాల్లోకి తేవడం, ఏన్పీ రికవరీని మెరుగుపరచినందుకు ప్రశంసించారు. పాఠశాల అధికారులు ఈ సందర్భంగా మహేశ్‌బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ వీ అరవింద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ 4 రాష్ట్రాల్లో 45 శాఖలతో మహేశ్‌బ్యాంకు పనిచేస్తోందని, 2028 నాటికి 50వ స్వర్ణోత్సవ వేడుకల సంవత్సరం నాటికి మరో 5 శాఖలను ప్రారంభించాలని యోచిస్తోందని బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ తెలిపారు. బ్యాంకు వ్యాపార మిశ్రమం నేటికి రూ.2,682 కోట్లుగా ఉందన్నారు.