calender_icon.png 5 November, 2024 | 2:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేరాలు నివారించేందుకు నిర్బంధ తనిఖీలు

05-11-2024 11:25:31 AM

సంగారెడ్డి (విజయక్రాంతి): నేరాలు నివారించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని నేరాలు నివారించేందుకు ప్రత్యేక నిగ ఏర్పాటు చేశామని జహీరాబాద్ డిఎస్పి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం జహీరాబాద్ మండలంలోని శాఖాపూర్ తండాలో కాటన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు, అనుమానం వస్తే అదుపులో తీసుకుంటామన్నారు. సరైన పత్రాలు లేని 50 బైకులు, 15 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. తాండలో నివాసముంటున్న నలుగురు గంజాయి స్మగ్లర్ తమకు పట్టించాలని కోరారు. గంజాయి స్మగ్లర్లకు సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పట్టణ, రూరల్ సీఐ శివలింగం, హనుమంతు, ఎస్ఐలు కాశీ నాథ్, రాజేందర్ రెడ్డి, ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు.