- సమాజంలో సమానత్వం సాధించడమే లక్ష్యం
- కలెక్టర్లు ఏర్పాట్లను పక్కాగా పూర్తి చేయాలి
- సర్వే షెడ్యూల్‌పై విస్తృత ప్రచారం చేయాలి
- కలెక్టర్లతో డిప్యూటీ సీఎం భట్టి వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్/ఖమ్మం, అక్టోబర్ 29 (విజయక్రాంతి): రాష్ట్రంలో నవంబర్ 6 నుంచి సామాజిక, ఆర్థిక, కులగణన సర్వే చేపట్టాల ని ప్రభుత్వం నిర్ణయించినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేలో అన్నింటినీ చేర్చాలని, సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు.
మంగళవారం సచివాలయం కేంద్రంగా జరిగిన అన్ని జిల్లా ల కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో ఖమ్మం జిల్లా మధిర తహసీల్దార్ కార్యాలయం నుంచి భట్టి పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ జిల్లాల కేంద్రాల నుంచి మం త్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, తుమ్మ ల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
సచివాల యం నుంచి సీఎస్ శాంతికుమారి, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ హరీశ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో వివిధ జాతుల సామాజిక, ఆర్థిక, ఆదాయ, విద్య, రాజకీయ స్థితిగతులను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, అప్పు డే సమాజంలో సమానత్వం కోసం విధానాలను రూపొందించగలమని అన్నారు.
పకడ్బందీగా నిర్వహించాలి
సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్లకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఎన్యుమరేటర్లుగా ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకోవాల న్నారు. వ్యక్తిగతంగా పర్యవేక్షించడం, ప్రతి ఎన్యుమరేటర్‌కు ఎన్యుమరేషన్ బ్లాక్ మ్యాప్, గృహ సర్వే షెడ్యూల్, ఎన్యుమరేటర్స్ మాన్యువల్ అందే విధంగా చూసు కోవాలని సూచించారు.
ఎన్యుమరేటర్లకు సమర్థవంతంగా శిక్షణ ఇవ్వాలని, వారికి కేటాయించిన సర్వే షెడ్యూల్‌లో చేర్చిన 50 ప్రశ్నలపై పూర్తి అవగాహన ఉండే విధంగా కలెక్టర్లు వారికి శిక్షణ ఇవ్వాలన్నారు. ఎన్యుమరేటర్లు ముం దుగా ఇంటి జాబితాను పూర్తి చేసి, పాఠశాల వేళల తర్వాత ప్రతిరోజూ 5 నుంచి 7 ఇళ్లను సందర్శించడం ద్వారా ఇంటి షెడ్యూల్‌ను ప్రారంభించాలన్నారు.
సర్వే నిర్వహణను పటిష్టంగా చేపట్టి నాణ్యమైన అవుట్‌పుట్ పొంద డానికి అవసరమైన సమయాన్ని కేటాయించాలని పేర్కొన్నారు. ఎన్యుమరేటర్లు, సూప ర్‌వైజర్లు, ఇతర సిబ్బందికి ఆకర్షణీయమైన వేతనం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు. సర్వే సమయంలో గ్రామా లు, పట్టణాలను సందర్శించాలని కలెక్టర్లను ఆదేశించారు.
సర్వే నిర్వహణపై ప్రతిరోజు సమీక్ష నిర్వహించాలన్నారు. సర్వే గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని, మీడియాను సమర్థవంతంగా ఉపయోగిం చుకోవాలని సూచించారు. సర్వే వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు డాటా ఎంట్రీ ఆపరేటర్లను గుర్తించాలని అన్నారు. రోజు వారి సర్వే పురోగతిని జిల్లా వారీగా ఏ రోజుకారోజు సాయంత్రం 6 గంటలకు తెలియజేయాలని పేర్కొన్నారు.