calender_icon.png 23 January, 2025 | 3:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ వర్గీకరణపై సమగ్ర నివేదిక

03-12-2024 12:15:23 AM

ఏకసభ్య కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్

హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి సమగ్ర నివేదికను అందజేస్తామని ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ తెలిపారు. పలు కులాలకు చెందిన వంద మందికిపైగా ప్రతినిధులు చైర్మన్ షమీం అక్తర్‌ను సోమవారం కలిసి వర్గీకరణపై తమ అభిప్రాయాలను తెలియజేశారు.

తమ కులాల వెనుకబాటుతనాన్ని, విద్య, ఉద్యోగాల సాధనలో రిజర్వేషన్లు పొందడంలో జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ రాతపూర్వక విజ్ఞప్తులను అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. తమ దృష్టికి వచ్చిన వినతిపత్రం అధ్యయనంలో ఎంతో ప్రాముఖ్యత వహిస్తుందని, వాటంన్నిటినీ జాగ్రత్తగా పరిశీలిస్తామన్నారు. వివిధ జిల్లాల్లో కమిషన్ పర్యటిస్తూ ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తుందని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో బుధవారం (ఈనెల 4న) మొదటి పర్యటన ఖరారైనట్టు తెలియజేశారు.