calender_icon.png 1 January, 2025 | 1:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమగ్ర శిక్ష ఉద్యోగుల వంటావార్పు

29-12-2024 01:05:19 AM

జగిత్యాల అర్బన్, డిసెంబర్ 28 (విజయక్రాంతి) : తమ రెగ్యులరైజేషన్ కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు గత 19 రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా శనివారం వంట వార్పు కార్య క్రమాన్ని నిర్వహించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసిల్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన దీక్ష శిబిరం వద్ద వంటలు చేసి అక్కడే సామూహిక భోజనాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ కొలువులను రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినప్ప టికీ ప్రభుత్వం ఏడాది గడిచిన ఈ దిశగా చర్యలు చేపట్టడం లేదని సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్ప టికైనా ప్రభుత్వం తమ కొలువు లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.