calender_icon.png 12 January, 2025 | 3:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమగ్ర శిక్ష ఉద్యోగుల పాదయాత్ర

05-01-2025 12:00:00 AM

  1. అంజన్నకు మొక్కులు చెల్లించుకున్న ఉద్యోగులు
  2. ఆంజనేయస్వామి విగ్రహానికి వినతి పత్రం 

సిరిసిల్ల, జనవరి 4 (విజయక్రాంతి): తమ సమస్యలు పరిష్కరించేలా రాష్ర్ట ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు పాదయాత్ర చేపట్టారు. శనివారం సిరిసిల్ల కలెక్టరేట్ నుంచి వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం ఆంజనేయ స్వామి ఆలయం వరకు పాదయాత్రగా వెళ్లారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొద్దిరోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రిలే నిరాహార దీక్ష చేస్తున్న, ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. శనివారం నిర్వహించే కేబినెట్ మంత్రి వర్గ సమావేశంలో తమ సమస్యలను పరిష్కరించేలా మంచి మనసును ప్రసాదించాలని వేడుకున్నామన్నారు.

అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, ఆంజనేయస్వామి విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘ అధ్యక్షులు తుమ్మ రాజేందర్. సభ్యులు,దేవయ్య, నరేందరు, నరేష్, చంద్రమౌళి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.