నిర్మల్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): తమ డిమాండ్ల సాధన కో సం సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు పోరుబాట పట్టారు. శుక్రవారం ఉ మ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 2,474 మంది ఉద్యోగులు అన్ని జిల్లా కేం ద్రాల్లో రిలే నిరాహార దీక్షలను ప్రాం భించారు. తమ డిమాం డ్లను ప్రభు త్వం పరిష్కరించకుంటే ఈ నెల 9 నుంచి నిరవధిక దీక్షలు చేపడుతామ ని ఉద్యోగులు హెచ్చరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేర కు కాంగ్రెస్ ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. చాలీచాల ని వేతనాలతో ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమ సమస్యలను పరిష్కరిం చాలని కోరారు. తమకు ఉద్యోగ భ ద్రత కల్పించి, ఆదుకోవాలని కోరారు.