16-12-2024 07:23:19 PM
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు, పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణ అన్నారు. విద్యాశాఖలోని సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ తో కలెక్టరేట్ ఎదుట చేపడుతున్న సమ్మె శిబిరాన్ని సోమవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పార్లమెంట్ ఇంచార్జ్ సందర్శించారు. సందర్భంగా మాట్లాడుతూ.. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరగదని భరోసానించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు శృతిక, నాయకులు మోహన్, సంతోష్, అనుప్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చరణ్, పట్టణ అధ్యక్షుడు రఫీక్ తదితరులు పాల్గొన్నారు.