calender_icon.png 23 April, 2025 | 4:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘భూ భారతి’తో రైతుకు సమగ్ర భూహక్కులు

23-04-2025 01:44:24 AM

కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట, ఏప్రిల్ 22(విజయక్రాంతి): భూ భారతి చట్టం-2025 ద్వారా భూ సమస్యలకు శాశ్వత  పరిస్కారం..సమగ్ర హక్కులు పరిస్కారం లభిస్తుందని  జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం సూర్యాపేట’ పెన్ పహాడ్ మండలాల రైతులతో   ‘భూ భారతి చట్టం’ 2025  పై  అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్బంగా  జిల్లా కలెక్టర్ మాట్లా డుతూ.. భూ భారతి చట్టం, చట్టం అమలుకు తక్కువ కాలంలోనే నియమాలు రూపొదించటం, చట్టం అమలు పర్చటానికి క్షేత్ర స్థాయి అధికారులు ఏర్పాటు, భూ సమస్యలను దరఖాస్తు చేసుకొనుటకు భూ భారతి పోర్టల్ సమస్య లను పరిష్కరించేందుకు అధికారుల అధికారాలు అనే నాలుగు మూ ల స్తంబాల ద్వారా సమస్యలు పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్  జయంతి ఏప్రిల్  14 రోజున భూ భారతి చట్టం ను లాంచనంగా ప్రారంభించి తదుపరి రాష్ర్ట స్థాయి లో, జిల్లా స్థాయి లో రెవిన్యూ సిబ్బందికి అవగాహన కల్పించటం జరిగిందని ఇప్పుడు మండల స్థాయి లో  ప్రజలకి చట్టం పై అవగాహన తెచ్చేందుకు 23 మండలాలలో ప్రజలకి సమస్యలు ఎలా పరిష్కరించాలో,అవగాహన సదస్సు లు నిర్వహిస్తున్నామని  పేర్కొన్నారు.

ధరణిలో చాలా సమస్యలు పరిష్కరించలేనివి ఉన్నాయని ప్రతి సమస్యని కలెక్టర్ ద్వారా గానీ కోర్టు ద్వారా గానీ పరిష్కరించే విధంగా ఉండేదని ప్రతి ఒక్కరు గ్రామం నుండి సూర్యాపేట వచ్చి సమస్య పై దరఖాస్తు ఇవ్వాలంటే ప్రజలకి చాలా ఇబ్బందిగా ఉండేదని కానీ భూ భారతి చట్టం ద్వారా అధికారం వికేంద్రికరణ జరుగుతుందని సమస్యని బట్టి తహసీల్దార్, ఆర్ డి ఓ, కలెక్టర్ స్థాయి లో పరిష్కరించవచ్చు అని త్వరలో గ్రామ స్థాయి లో భూ సమస్యలు పరిష్కరించేందుకు  గ్రామ పరిపాలన అధికారి (జి పి ఓ)  నియమించబోతున్నారని తెలిపారు.

భూ భారతి చట్టం ఏప్రిల్ 14 న ప్రారంభించి నాలుగు మండలాలలో  పైలెట్ ప్రాజెక్ట్ కింద అమలు జరుగుతుందని తదుపరి ప్రతి జిల్లాలో ఒక్క మండలంలో అమలు చేస్తారని  అక్కడ ఏమైనా సమస్యలు పరిస్కారం కాకపోతే భూ భారతి చట్టంలో మార్పులు తెచ్చి భూ సమస్యలు తీర్చుతారని తదుపరి   రాష్ర్ట వ్యాప్తంగా ప్రతి గ్రామం లో భూ భారతి చట్టం అమలు జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు  కలెక్టర్ పి.రాంబాబు.ఆర్డీఓ వేణు మాధవ్ రావు.తహసీల్దార్ దరావత్ లాలూ నాయక్.ఎంపీడీఓ వెంకటేశ్వర్లు రావు, మాజీ మార్కెట్ చైర్మన్ తూముల భుజంగరావు,ఏవో అనిల్ నాయక్, ఏపీఎం అజయ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

భూ భారతి అవగాహన సదస్సును జయప్రదం చేయండి 

మఠంపల్లి ఏప్రిల్ 22: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలోని వీఆర్‌ఎల్ ఫంక్షన్ హాల్లో బుధవారం ఉదయం 9.00 గంటలకు జరిగే భూభారతి చట్టం -2025 సదస్సుకు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ హాజరుకానున్నారని మఠంపల్లి ఎమ్మార్వో మంగ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.భూ భారతి చట్టంపై సమగ్ర అవగాహన కొరకు మండలములోని రైతులు, నాయకులు,ప్రజాప్రతినిధులు, అధికారులు, మండల ప్రజలందరూ హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.