- రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న కుటుంబ సర్వే
- జూబ్లీహిల్స్‌లో వివరాలు నమోదు చేసుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే ముమ్మరంగా సాగుతోంది. ఈ సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్య, కుల సర్వే బుధవారానికి ఐదో రోజుకు చేరుకుంది. మొదట్లో ఇబ్బంది పడిన ఎన్యూమరేటర్లు వివరాల సేకరణలో వేగం పెంచారు.
కొందరు ఎన్యూ మరేటర్లు ఎక్కువ పత్రాలను నింపాలన్న ఉద్దేశంతో తప్పులు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. నాణ్యమైన సర్వేపై సిబ్బంది దృష్టి పెట్టాలని సూచించారు. వేగంతోపాటు సర్వేలో నాణ్యత కూడా అవసరం అని చెప్తున్నారు. గ్రామాల్లో ఎన్యూమరేటర్లు ఏ వీధికి, ఎప్పుడు వస్తున్నారో చెప్పడంతో.. అవసరమైన వివరాలతో ప్రజలు సిద్ధంగా ఉంటున్నారు.
అయితే పట్టణాల్లోని కొన్ని ప్రాం తాల్లో ముంద స్తు సమాచారం ఇవ్వకపోవడంతో ప్రజల ఇళ్ల వద్ద ఉండక ఎన్యూ మరేటర్లు వెనుదిరిగిపోవాల్సి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఐదోరోజు సర్వేలో పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్‌లోని తన ఇంటికి వచ్చిన ఎన్యూ మరేటర్లకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన వివరాలను అంద జేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం సర్వేలో తమ వివరాలను నమో దు చేసుకున్నారు. కలెక్టర్లు, ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వేను సమీక్షించారు.